లక్నో: శనివారం కన్నుమూసిన ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం కళ్యాణ్‌సింగ్( Kalyan Singh ) భౌతికకాయానికి ప్రధాని నరేంద్ర మోదీ నివాళులర్పించారు. ఆదివారం ఉదయం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో లక్నో వచ్చిన మోదీ.. నేరుగా కళ్యాణ్ సింగ్ నివాసానికి వెళ్లారు. ఆయన పార్థివదేహానికి నమస్కరించారు. కళ్యాణ్‌సింగ్ జన సంక్షేమాన్నే తన జీవిత మంత్రంగా చేసుకున్నారు. ఆయన యూపీతోపాటు దేశ అభివృద్ధికి పాటుపడ్డారు. నిజాయితీ, మంచి పాలనతో పేరు సంపాదించారు అని మోదీ ఈ సందర్భంగా అన్నారు.
#WATCH | Uttar Pradesh: PM Narendra Modi pays his last respects to former UP CM Kalyan Singh at the latter's residence in Lucknow. pic.twitter.com/LMPDk0Zwqf
— ANI (@ANI) August 22, 2021