శుక్రవారం 03 ఏప్రిల్ 2020
National - Mar 07, 2020 , 02:10:52

మంచి గురించి మాట్లాడుతారు

మంచి గురించి మాట్లాడుతారు
  • మంచి చేస్తే ద్వేషిస్తారు
  • విమర్శకులపై ప్రధాని ధ్వజం

న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టం, ఆర్టికల్‌ 370 రద్దు వంటి నిర్ణయాలపై తమ ప్రభుత్వం మీద విమర్శలు గుప్పించే వారిపై ప్రధాని నరేంద్రమోదీ విమర్శలు ఎక్కుపెట్టారు. ‘మంచిని మాట్లాడే’ విమర్శకులు.. మంచి చేస్తున్న వారిని, పూర్వస్థితిని బ్రేక్‌చేసిన వారిని ద్వేషిస్తున్నారని ఆరోపించారు. ఈటీ గ్లోబల్‌ బిజినెస్‌ సమ్మిట్‌లో శుక్రవారం ప్రధాని ప్రసంగించారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం క్లిష్టదశలో ఉన్నదని, అయితే భారత ఆర్థిక వ్యవస్థ పునాదులు బలంగా ఉన్నాయని, విధానాల్లో స్పష్టత ఉన్నదని చెప్పారు. ‘మంచిని మాట్లాడే’ గ్యాంగ్‌.. ప్రపంచవ్యాప్తంగా శరణార్థుల హక్కుల గురించి ప్రస్తావిస్తుందని, విదేశాల్లో మత పీడనకు గురైన మైనార్టీలకు భారత్‌ పౌరసత్వం ఇవ్వడాన్ని మాత్రం వ్యతిరేకిస్తున్నదని ధ్వజమెత్తారు. రాజ్యాంగ పరిరక్షణ గురించి ఈ గ్యాంగ్‌ మాట్లాడుతుందని, అయితే రాజ్యాంగంలోని తాత్కాలిక నిబంధన అయిన ఆర్టికల్‌ 370ని రద్దుచేసి, జమ్ముకశ్మీర్‌లో పూర్తిస్థాయిలో భారత రాజ్యాంగాన్ని అమలు చేస్తుంటే వ్యతిరేకిస్తున్నదని మండిపడ్డారు. 


logo