న్యూఢిల్లీ: ఇవాళ వరల్డ్ లయన్ డే ( World Lion Day ). ప్రపంచ సింహాల దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ గ్రీటింగ్స్ తెలిపారు. తన ట్విట్టర్లో ఆయన రియాక్ట్ అయ్యారు. ఆసియాటిక్ సింహాలకు భారత్ నిలయం కావడం గర్వకారణమన్నారు. అయితే గత కొన్ని ఏళ్ల నుంచి భారత్లో సింహాల సంఖ్య గణనీయంగా పెరుగుతోందని ఆయన తెలిపారు. ఇది సంతోషకర విషయమన్నారు.
The lion is majestic and courageous. India is proud to be home to the Asiatic Lion. On World Lion Day, I convey my greetings to all those passionate about lion conservation. It would make you happy that the last few years have seen a steady increase in India’s lion population. pic.twitter.com/GaCEXnp7hG
— Narendra Modi (@narendramodi) August 10, 2021
కేంద్ర అటవీశాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ కూడా స్పందించారు. వరల్డ్ లయన్ డే నాడు ఓ గొప్ప సంరక్షణా సక్సెస్ సోర్టీ చెప్పాలన్నారు. గుజరాత్లో సుమారు 30 వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో సుమారు 674 ఆసియాటిక్ సింహాలు ఉన్నట్లు మంత్రి వెల్లడించారు. ఒకప్పుడు తన ఉనికిని కోల్పోయిన ఆ సింహాలు ఇప్పుడు తమ ప్రాంతాన్ని మళ్లీ ఆక్రమిస్తున్నట్లు తెలిపారు. ఇదే రీతిలో సింహాల సంరక్షణ కొనసాగాలన్నారు.
A great conservation success story that must be told on #WorldLionDay. As many as 674 #AsiaticLions🦁 spread across 30,000 sq km reside and thrive in Gujarat. The big cat is re-colonising its lost territories. Let’s continue to build on this. pic.twitter.com/ZyhOE9vHAn
— Bhupender Yadav (@byadavbjp) August 10, 2021
హైదరాబాద్కు చెందిన సిటీ పోలీసు శాఖ కూడా వరల్డ్ లయన్ డేపై ఓ ట్వీట్ చేసింది. సింహాలను రక్షించడం మన బాధ్యత అని ఆ ట్వీట్లో తెలిపారు.
#WorldLionDay will always remind us that it is our responsibility to #savelions and make this world a better place for them to live.
— హైదరాబాద్ సిటీ పోలీస్ Hyderabad City Police (@hydcitypolice) August 10, 2021
"A lion sleeps in the heart of every brave man. Wake it up and be the King."#worldlionday2021 pic.twitter.com/xEgBxpMLzY