ముంబై: ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఇవాళ పుణె పర్యటన రద్దు అయ్యింది. భారీ వర్షాల వల్ల ఆ ట్రిప్ క్యాన్సిల్ చేశారు. పుణెలో మెట్రో రైలును మోదీ ప్రారంభించాల్సి ఉన్నది. దానితో పాటు అనేక అభివృద్ధి ప్రాజెక్టుల్లో అతను పాల్గొననున్నారు. అయితే వర్షాల కారణంగా పుణెలో మోదీ పర్యటన రద్దు చేశామని, త్వరలో కొత్త తేదీని ప్రకటించనున్నట్లు బీజేపీ వర్గాలు వెల్లడించాయి. బుధవారం సాయంత్రం భారీగా వర్షం కురిసింది. ఎస్పీ కాలేజీ గ్రౌండ్లో మోదీ సభను నిర్వహించాల్సి ఉంది. కానీ ఆ గ్రౌండ్ పూర్తిగా నీటమయం అయ్యింది. సభా ప్రాంగణాన్ని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్.. బుధవారం విజిట్ చేశారు. అక్కడ జరుగుతున్న ఏర్పాట్లను ఆయన పర్యవేక్షించారు. కానీ గురువారం కూడా పుణెతో పాటు ముంబైలో భారీ వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరిక చేసిన నేపథ్యంలో మోదీ ట్రిప్‌ను రద్దు చేశారు.