న్యూఢిల్లీ: జీ-20 (G-20) నేతలు జాతిపిత మహాత్మా గాంధీకి (Mahatma Gandhi) ఘనంగా నివాళులు అర్పించారు. జీ20 రోజురోజు సమావేశానికి ముందు ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌కి (Rajghat) వెళ్లిన నేతలు మహాత్ముని సమాధి వద్ద శ్రద్ధాంజలి ఘటించారు. వివిధ అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు కూడా గాంధీజీకి పుష్పాంజలి ఘటించారు. ‘శాంతి గోడ’పై సంతకాలు చేశారు. అంతకుముందు ఒక్కక్కరుగా రాజ్‌ఘాట్‌కు చేరుకున్న నేతలకు ప్రధాని మోదీ (PM Modi) స్వాగతం పలికారు. రాజ్‌ఘాట్ విశేషాలను వారికి వివరించారు.
మహాత్మునికి అంజలి ఘటించిన వారిలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden), యూకే ప్రధాని రిషి సునాక్ (Rishi Sunak), బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, ఐరాస సక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రస్, చైనా ప్రధాని లీ కియాంగ్ ప్రీమియర్, రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్, టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్, ఇటలీ ప్రధాని జార్జియా మెలోని, జర్మనీ ఛాన్సలర్ ఓలాఫ్ స్కోల్జ్, దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్, జపాన్ ప్రధాని పుమియో కిషిదా, సింగపూర్ ప్రధాని లీ సియన్ లూంగ్, నెదర్లాండ్స్ పీఎం మార్క్ రుట్టే, ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫట్టా అల్-సిసి, ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో, నైజీరియా అధ్యక్షుడు బోలా అహ్మద్ టినుబు, అర్జెంటీనా అధ్యక్షుడు అల్బెర్టో ఫెర్నాండెజ్, స్పెయిన్ వైస్ ప్రెసిడెంట్ నాడియా క్వాలినో తదితరులు ఉన్నారు. అనంతరం అమెరికా అధ్యక్షుడు వియత్నాం (Vietnam) బయలుదేరారు.
At the iconic Rajghat, the G20 family paid homage to Mahatma Gandhi – the beacon of peace, service, compassion and non-violence.
As diverse nations converge, Gandhi Ji’s timeless ideals guide our collective vision for a harmonious, inclusive and prosperous global future. pic.twitter.com/QEkMsaYN5g
— Narendra Modi (@narendramodi) September 10, 2023
#WATCH | G 20 in India: Prime Minister Narendra Modi, US President Joe Biden, UK PM Rishi Sunak at Delhi's Rajghat after paying homage to Mahatma Gandhi. pic.twitter.com/azaIS9d62L
— ANI (@ANI) September 10, 2023