న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోదీ రేపు ఉత్తరప్రదేశ్‌లో పర్యటించనున్నారు. ఈ నెల 25న ఉత్తరప్రదేశ్‌లోని సిద్ధార్థనగర్, వారణాసిలలో ప్రధాని మోదీ పర్యటించనున్నారని ఢిల్లీలోని ప్రధానమంత్రి కార్యాలయం తెలిపింది. సిద్ధార్థనగర్‌లోని ఆయన తొమ్మది మెడికల్ కాలేజీలను ప్రారంభించనున్నారు. అనంతరం ప్రధాని వారణాసికి వెళ్లి ప్రధానమంత్రి ఆత్మనిర్బర్ స్వాస్థ్ భారత్ యోజన కార్యక్రమాన్ని మొదలుపెట్టనున్నారు. అదేవిధంగా వారణాసిలో రూ.5200 కోట్ల విలువ చేసే పలు అభివృద్ధి కార్యక్రమాలను కూడా ప్రధాని ప్రారంభించనున్నారని పీఎంవో వెల్లడించింది.