కోల్కతా: పశ్చిమబెంగాల్ నూతన ముఖ్యమంత్రిగా సువేందు అధికారి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని మోదీ బీజేపీ సీనియర్ నాయకుడు మఖ్కన్ లాల్ సర్కార్(98)కు పాద నమస్కారం చేసి, ఆశీర్వాదం తీసుకోవడం అందరినీ ఆకర్షించింది. మఖ్కన్ లాల్ సర్కార్ జాతీయోద్యమం ప్రారంభపు రోజుల నాటి సమర యోధుడు. 1952లో కశ్మీర్లో భారత త్రివర్ణ పతాకం ఎగుర పతాకం ఎగరేసినప్పుడు జరిగిన ఆందోళనల్లో స్వాతంత్య్ర సమరయోధుడు శ్యామా ప్రసాద్ ముఖర్జీ వెంట ఉన్నారు.