న్యూఢిల్లీ, ఆగస్టు 19: ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 23న ఉక్రెయిన్‌లో పర్యటించనున్నారు. ఆ దేశాధ్యక్షుడు జెలెన్స్కీ కోరిక మేరకు ఈ పర్యటన ఖరారైందని విదేశాంగ శాఖ సోమవారం తెలిపింది. ఈ నెల 21న మోదీ పోలెండ్‌ను సందర్శించి ఆ దేశ ప్రధాని డొనాల్డ్ టస్క్‌తో సమావేశమవుతారని చెప్పింది. 30 ఏండ్లుగా ఉక్రెయిన్-భారత్ మధ్య దౌత్య సంబంధాలు కొనసాగుతున్నాయని.. ఆ దేశంలో పర్యటించనున్న తొలి భారత ప్రధాని మోదీనేనని విదేశాంగ శాఖ వెల్లడించింది.