చెన్నై: రామేశ్వరం వద్ద సముద్రంలో నిర్మించిన కొత్త పంబన్ రైల్వే బ్రిడ్జ్‌ను ఏప్రిల్ ఆరో తేదీన ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. దానితో పాటు మరికొన్ని ప్రాజెక్టులను ఆయన దేశానికి అంకితం చేయనున్నారు. కొత్త పంబన్ బ్రిడ్జ్‌కు చెందిన వీడియోను రైల్వే శాఖ తన ట్విట్టర్లో పోస్టు చేసింది. వర్టికల్ లిఫ్ట్ బ్రిడ్జ్‌ను ఓపెన్ చేసి ఆ తర్వాత రామేశ్వరం-తాంబరం మధ్య నడిచే కొత్త రైలును మోదీ ప్రారంభించనున్నారు. కొత్త వర్టికల్ లిఫ్ట్ బ్రిడ్జ్ నుంచి వెళ్లే కోస్టు గార్డు షిప్‌కు కూడా ఆయన పచ్చజెండా ఊపనున్నారు.
The New Pamban Bridge soars above the waves, ushering in enhanced connectivity and modern innovations. pic.twitter.com/AeDbXpljol
— Ministry of Railways (@RailMinIndia) April 5, 2025
రామేశ్వరంలోని రామనాథస్వామి ఆలయాన్ని ఆయన మధ్యాహ్నం 12.45 నిమిషాలకు సందర్శించనున్నారు. దర్శనం, పూజ తర్వాత శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారు. తమిళనాడుకు చెందిన సుమారు 8300 కోట్ల ఖరీదైన వేర్వేరు రైల్వే, రోడ్డు పనులను ఆయన దేశానికి అంకితం చేస్తారు.
The Cabinet decision on approving four multitracking projects relating to the Indian Railways will improve our connectivity infrastructure, boost convenience, reduce logistics costs and strengthen supply chains. https://t.co/STURY6NV94
— Narendra Modi (@narendramodi) April 5, 2025