PM Modi | బ్యాలెట్ పేపర్ ఎన్నికలు.. కాంగ్రెస్ ఖాతానే తెరువలేదుగా.. ప్రధాని మోదీ సెటైర్..!
PM Modi | ఇటీవల నాలుగు రాష్ట్రాల్లో జరిగిన ఎమ్మెల్సీ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒక్క స్థానాన్ని కూడా గెలుచుకోలేకపోయింది. ఈ ఫలితాలపై ప్రధాని నరేంద్రమోదీ వ్యంగ్యంగా స్పందించారు. ఎందుకంటే ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసి బీజేపీ అక్రమంగా ఎన్నికల్లో గెలుస్తోందని కాంగ్రెస్ పార్టీ తరచూ ఆరోపిస్తున్నది.
PM Modi : ఇటీవల నాలుగు రాష్ట్రాల్లో జరిగిన ఎమ్మెల్సీ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒక్క స్థానాన్ని కూడా గెలుచుకోలేకపోయింది. ఈ ఫలితాలపై ప్రధాని నరేంద్రమోదీ వ్యంగ్యంగా స్పందించారు. ఎందుకంటే ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసి బీజేపీ అక్రమంగా ఎన్నికల్లో గెలుస్తోందని కాంగ్రెస్ పార్టీ తరచూ ఆరోపిస్తున్నది. ఈ నేపథ్యంలో బ్యాలెట్ పత్రాలతో ఎన్నికలు జరిగాయని, కాంగ్రెస్ పార్టీ ఖాతానే తెరువలేదుగా అని ప్రధాని ఎక్స్‌లో సెటైరికల్ పోస్టు చేశారు. ఈ పోస్టుకు ‘మోనోకిల్’ ఎమోజీని జతచేశారు.
కాగా ఇటీవల ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్, కర్ణాటక రాష్ట్రాల్లో మొత్తం 28 ఎమ్మెల్సీ స్థానాలకు ఉపఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్ 12 స్థానాల్లో పోటీ చేసింది. కానీ ఒక్క స్థానంలో కూడా గెలువలేదు. గతంలో ఆ పార్టీ గెలిచిన నాలుగు స్థానాలు కూడా చేజారిపోయాయి. కర్ణాటకలో అధికారంలో ఉన్నప్పటికీ కాంగ్రెస్‌కు సీటు దక్కకపోవడం గట్టి ఎదురుదెబ్బగా చెప్పవచ్చు. ఈ ఫలితాలను ప్రస్తావిస్తూ మోదీ కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు.
ఓటింగ్ యంత్రాల్లో అక్రమాలు జరుగుతున్నాయంటూ కాంగ్రెస్ తరచూ ఆరోపణలు చేస్తున్నది. బ్యాలెట్ పత్రాలతో ఎన్నికలు నిర్వహించాలని కూడా కోరింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ ఎన్నికలు బ్యాలెట్ పత్రాలతోనే జరిగాయని మోదీ గుర్తుచేశారు. అయినా కాంగ్రెస్‌కు ఒక్క సీటు కూడా రాలేదంటూ పరోక్షంగా ఎద్దేవాచేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
PM Modi | బ్యాలెట్ పేపర్ ఎన్నికలు.. కాంగ్రెస్ ఖాతానే తెరువలేదుగా.. ప్రధాని మోదీ సెటైర్..!
‘పట్టభద్రులంతా ఓటు నమోదు చేసుకోవాలి’
CID Digital Services | సీఐడీలో ఏడు డిజిటల్ సేవలు ప్రారంభం.. జైళ్ల నుంచి విడుదలయ్యే ఖైదీలపై నిఘా
గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ యూనైటెడ్ అసోసియేషన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కొండ్రు విజయరావు
Lice | పిల్లలకు తలలో పేలు ఎలా ఏర్పడుతాయి.. తొలగేందుకు ఏం చేయాలి..?
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

