Hyderabad devotee | తిరుమలలో పోగొట్టుకున్న 40 గ్రాముల బంగారు కడియాన్ని హైదరాబాద్ భక్తురాలికి తిరిగి అప్పగింత
Hyderabad devotee | తిరుమలలో శ్రీవారి దర్శనానికి వచ్చిన హైదరాబాద్‌కు చెందిన భక్తురాలు శ్రీపాద రాజ శృతి పోగొట్టుకున్న బంగారు కడియాన్ని సీసీ టీవీల నిఘా సహాయంతో తిరిగి అప్పగించారు.
తిరుమల : తిరుమలలో శ్రీవారి దర్శనానికి వచ్చిన హైదరాబాద్‌కు చెందిన భక్తురాలు (Hyderabad devotee) శ్రీపాద రాజ శృతి (Sripada Raja Sruthi ) గొట్టుకున్న బంగారు కడియాన్ని ( Gold kadiyam ) సీసీ టీవీల నిఘా సహాయంతో తిరిగి అప్పగించారు. ప్రసాదం పంపిణీ కేంద్రం సమీపంలోని తాగునీటి పాయింట్ వద్ద అనుకోకుండా పోగొట్టుకున్న సుమారు 40 గ్రాముల బంగారు కడియాన్ని శుక్రవారం పోగొట్టుకుంది.
భక్తురాలి చేతి నుంచి కడియం జారిపడిన విషయాన్ని వెనుక ఉన్న కొంతమంది భక్తులు గుర్తించి తీసుకున్నారు. ఈ ఘటనను కమాండ్ కంట్రోల్ సిబ్బంది సీసీటీవీ కెమెరాల ద్వారా గుర్తించి వెంటనే అప్రమత్తమయ్యారు.
టీటీడీ సీవీఎస్వో కె.వి. మురళీకృష్ణ ఆదేశాల మేరకు, విజిలెన్స్ అధికారి (వీజీఓ) సురేంద్ర పర్యవేక్షణలో కమాండ్ కంట్రోల్ ఏవీఎస్వో వెంకటరమణ, సిబ్బంది సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించి కడియాన్ని గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నారు.
అసలు యజమానురాలైన భక్తురాలికి అప్పగించినట్లు ఏవీఎస్వో వెంకటరమణ తెలిపారు.తన విలువైన బంగారు కడియం తిరిగి లభించడంతో భక్తురాలు ఆనందం వ్యక్తం చేస్తూ టీటీడీ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ అధికారులకు, సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad devotee | తిరుమలలో పోగొట్టుకున్న 40 గ్రాముల బంగారు కడియాన్ని హైదరాబాద్ భక్తురాలికి తిరిగి అప్పగింత
తుంగతుర్తిలో ఘనంగా విద్యాసాగర్ రావు జయంతి వేడుకలు
సారపాకలో బాల గ్రామ సభ
Male Prisoner Made To Wear Saree | జైలులో యువకుడికి చీర కట్టించి.. లైంగికంగా వేధించిన తోటి ఖైదీలు
Boinapalli Vinod Kumar | సోనియా గాంధీ ఆత్మకథలో తెలంగాణ గురించి రాయకపోవడం బాధాకరం : మాజీ ఎంపీ వినోద్ కుమార్
ట్రెండింగ్ వార్తలు
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?

