సారపాకలో బాల గ్రామ సభ
భారతదేశ భవిష్యత్ బాలల చేతుల్లోనే ఉందని బూర్గంపహాడ్ మండలం సారపాక ఉప సర్పంచ్ కన్నెదారి రమేశ్ అన్నారు. శనివారం సారపాక పంచాయతీలో ఈవో గుగులోత్ రవికుమార్ అధ్యక్షతన బాల గ్రామ సభ నిర్వహించగా ఆయన పాల్గొని మాట్లాడారు. గ్రామాభివృద్దిలో...
బూర్గంపహాడ్, నవంబర్ 14 : భారతదేశ భవిష్యత్ బాలల చేతుల్లోనే ఉందని బూర్గంపహాడ్ మండలం సారపాక ఉప సర్పంచ్ కన్నెదారి రమేశ్ అన్నారు. శనివారం సారపాక పంచాయతీలో ఈవో గుగులోత్ రవికుమార్ అధ్యక్షతన బాల గ్రామ సభ నిర్వహించగా ఆయన పాల్గొని మాట్లాడారు. గ్రామాభివృద్దిలో పిల్లల భాగస్వామ్యం, హక్కులు, విద్య, ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ వంటి పలు కీలక అంశాలపై చర్చించారు. ప్రథమ ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ పిల్లలను ఎంతగానో ప్రేమించేవారని ఆయన పుట్టిన రోజును బాలల దినోత్సవంగా జరుపుకోవడం గొప్ప విషయమన్నారు. అదేవిధంగా నాగినేనిప్రోలు రెడ్డిపాలెం, మోరంపల్లిబంజర్, కృష్ణసాగర్, బూర్గంపహాడ్, ఇరవెండి, పినపాక పట్టీనగర్, అంజనాపురం, లక్ష్మీపురం, ముసలిమడుగు తదితర పంచాయతీల్లో బాల గ్రామ సభలు నిర్వహించి బాలల దినోత్సవ విశిష్టతను ఆయా సర్పంచులు చాటిచెప్పారు. ఈ కార్యక్రమాల్లో ఎంపీడీవో జమలారెడ్డి, ఎంపీవో రామకృష్ణతో పాటు ఆయా పంచాయతీల సర్పంచులు, ఉప సర్పంచులు, పాలకవర్గాల సభ్యులు, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సారపాకలో బాల గ్రామ సభ
Male Prisoner Made To Wear Saree | జైలులో యువకుడికి చీర కట్టించి.. లైంగికంగా వేధించిన తోటి ఖైదీలు
Boinapalli Vinod Kumar | సోనియా గాంధీ ఆత్మకథలో తెలంగాణ గురించి రాయకపోవడం బాధాకరం : మాజీ ఎంపీ వినోద్ కుమార్
ఇళ్ల స్థలాల కోసం ఎర్రజెండాలు.. భూమి కోసం రైతు కుటుంబం పోరాటం
Tribals Migration | తెలంగాణలో వలస బాట పట్టిన గిరిజనులు.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?

