Rahul Gandhi | పదేళ్లుగా ఫాసిస్టుల గొంతు గట్టిగా వినిపిస్తోంది.. భారత్ సమిట్‌లో రాహుల్‌గాంధీ
Rahul Gandhi | దేశంలో గడిచిన పదేళ్లుగా ఫాసిస్టుల గొంతు గట్టిగా వినిపిస్తోందని కాంగ్రెస్ పార్టీ లోక్‌సభాపక్ష నాయకుడు, ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) అన్నారు. దేశ రాజకీయాల్లో ఫాసిస్టులకు చోటులేదని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ (Hyderabad) లో ఏర్పాటు చేసిన భారత్ సమిట్ (Bharat Summit) లో ఆయన ప్రసంగించారు.
Rahul Gandhi : దేశంలో గడిచిన పదేళ్లుగా ఫాసిస్టుల గొంతు గట్టిగా వినిపిస్తోందని కాంగ్రెస్ పార్టీ లోక్‌సభాపక్ష నాయకుడు, ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) అన్నారు. దేశ రాజకీయాల్లో ఫాసిస్టులకు చోటులేదని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ (Hyderabad) లో ఏర్పాటు చేసిన భారత్ సమిట్ (Bharat Summit) లో ఆయన ప్రసంగించారు. ఫాసిస్టులవల్ల వ్యవస్థలు ధ్వంసం అవుతున్నాయని మండిపడ్డారు.
2014లో జరిగిన ఎన్నికల లాంటి ఎన్నికలను తాను గతంలో ఎప్పుడూ చూడలేదని రాహుల్‌గాంధీ అన్నారు. ఆ ఎన్నికల్లో వందల కోట్లు ఖర్చు చేశారని, భారత ప్రజాస్వామ్య వ్యవస్థ ధ్వంసమైందని వ్యాఖ్యానించారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లోనూ అక్రమాలు జరిగాయన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్రలో యూపీఏ కూటమి ఎక్కువ సీట్లు గెలిచిందని, ఆ తర్వాత మూడు నెలలకే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయామని ఆయన గుర్తుచేశారు.
ఆ ఎన్నికల్లోనూ అనేక అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపించారు. కేవలం మూడు నెలల వ్యవధిలో 70 లక్షలకుపైగా ఓట్లను నమోదు చేశారని, అదనంగా చేర్చిన ఆ ఓట్లతోనే బీజేపీ గెలిచిందని విమర్శించారు. వ్యవస్థలు నాశనమవుతున్నా మనం ప్రజాస్వామ్యం అని గొప్పగా చెప్పుకొంటున్నామని, రాజకీయాలంటే గట్టిగా మాట్లాడటం, ఘాటైన విమర్శలు చేయడం కాదని మండిపడ్డారు. పన్నెండేళ్ల క్రితం కుబేరుల జాబితాలో 600వ స్థానంలో ఉన్న అదానీ ఇప్పుడు ఎక్కడున్నారని రాహుల్‌గాంధీ ప్రశ్నించారు.
మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత సంపన్నుల జాబితాలో అదానీ రెండో స్థానంలోకి వచ్చారని, ఏ రంగంలో చూసినా అదానీ పెట్టుబడులే కనిపిస్తాయని విమర్శించారు. మోదీ హయాంలో అదానీ వ్యాపారం బాగా పెరిగిందని చెప్పారు. పోర్టులు, విమానాశ్రయాలు, మౌలిక వసతులు అదానీకి అప్పగించారని ఆరోపించారు. అలా లబ్ధి పొందిన వ్యాపారులే వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారని విమర్శించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | పదేళ్లుగా ఫాసిస్టుల గొంతు గట్టిగా వినిపిస్తోంది.. భారత్ సమిట్‌లో రాహుల్‌గాంధీ
Hyderabad devotee | తిరుమలలో పోగొట్టుకున్న 40 గ్రాముల బంగారు కడియాన్ని హైదరాబాద్ భక్తురాలికి తిరిగి అప్పగింత
తుంగతుర్తిలో ఘనంగా విద్యాసాగర్ రావు జయంతి వేడుకలు
సారపాకలో బాల గ్రామ సభ
Male Prisoner Made To Wear Saree | జైలులో యువకుడికి చీర కట్టించి.. లైంగికంగా వేధించిన తోటి ఖైదీలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?

