బెంగుళూరు: కర్నాటకలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఇవాళ రాహుల్ గాంధీ(Rahul Gandhi) మాట్లాడారు. హసన్ నియోజకవర్గ జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ కుంభకోణంపై రాహుల్ ఆరోపణలు చేశారు. అది సెక్స్ స్కాండ్ కాదు, అదో మాస్ రేప్ అన్నారు. ప్రజ్వల్ రేవణ్ణ ఓ సామూహిక రేపిస్టు అన్న విషయం ప్రతి బీజేపీ నేతకు తెలుసు అని, అయినా వాళ్లు ఆ రేపిస్టుకు మద్దతు ఇచ్చారని, జేడీఎస్‌తో కూటమి ఏర్పాటు చేశారని రాహుల్ విమర్శించారు. ప్రజ్వల్ రేవణ్ణ 400 మంది మహిళల్ని రేప్ చేశాడని, వాటి వీడియోలు తీశారని ఆఓపించారు. శివమొగ్గలో జరిగిన సభలో రాహుల్ మాట్లాడుతూ ఆ మాస్ రేపిస్టుకు ప్రధాని మోదీ మద్దతు ఇచ్చారని ఆరోపించారు.