న్యూఢిల్లీ: తన పాదాలు తాకేందుకు ప్రయత్నించిన బీజేపీ అభ్యర్థిని ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) నిలువరించారు. బదులుగా ఆ నేత పాదాలను మూడుసార్లు తాకి నమస్కరించారు. మోదీ తీరు చూసి ఆ వేదికపై ఉన్న బీజేపీ నేతలు ఆశ్చర్యపోయారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. జనవరి 29న ఈశాన్య ఢిల్లీలోని ఘోండాలో జరిగిన ఎన్నికల సభలో ప్రధాని మోడీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ అభ్యర్థులంతా వేదికపైకి రావాలని ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్దేవా కోరారు. బీజేపీ అభ్యర్థుల్లో చాలా మంది మోదీకి నమస్కరించడంతోపాటు ఆయన పాదాలను తాకారు.
కాగా, పట్పర్గంజ్ బీజేపీ అభ్యర్థి రవీందర్ సింగ్ నేగి కూడా వేదికపైకి వచ్చారు. ప్రధాని మోదీకి నమస్కరించి ఆయన పాదాలు తాకేందుకు ముందుకు వంగారు. ఇంతలో మోదీ వెంటనే స్పందించి ఆయనను నిలువరించారు. ప్రతిగా బీజేపీ అభ్యర్థి రవీందర్ సింగ్ నేగి పాదాలను మూడుసార్లు తాకి ఆయనకు నమస్కరించారు. ఆ తర్వాత విశ్వాస్ నగర్ అభ్యర్థి ఓం ప్రకాష్ శర్మ కూడా మోదీ పాదాలను తాకడానికి ప్రయత్నించగా మధ్యలోనే అడ్డుకున్నారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
#ElectionsWithNDTV | PM Modi touches BJP leader Ravinder Negi’s feet 3 times. He is also contesting the upcoming #DelhiElections from Patparganj pic.twitter.com/sxGXYn1Hka
— NDTV (@ndtv) January 30, 2025