భారత తొలి మానవ సహిత అంతరిక్ష యాత్ర ‘గగన్యాన్’ కోసం నలుగురు వ్యోమగాములు ఎంపికయ్యారు. వాయుసేన గ్రూప్ కెప్టెన్లు ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్, అంగద్ ప్రతాప్, అజిత్ కృష్ణన్, వింగ్ కమాండర్ సుభాన్షు శుక్లా వచ్చే ఏడాది స్వదేశీ వ్యోమనౌకలో రోదసీలోకి వెళ్లనున్నారు. ఢిల్లీలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో ఎంపికైన వ్యోమ సిబ్బంది వివరాలను ప్రధాని మోదీ ప్రకటించారు.