యమునానగర్: 1919లో అమృత్‌సర్‌లో జరిగిన జలియన్‌వాలాబాగ్ దమనకాండకు వ్యతిరేకంగా న్యాయ పోరాటం చేసిన లాయర్ సీ శంకరన్ నాయర్‌ను ప్రధాని మోదీ(PM Modi) ఇవాళ గుర్తు చేసుకున్నారు. కేరళలో పుటిన నాయర్.. బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడినట్లు మోదీ తెలిపారు. హర్యానాలోని యమునానగర్‌లో 800 మెగావాట్ల ధర్మల్ విద్యుత్తు ప్లాంట్‌కు శంకుస్థాపన వేసిన తర్వాత ప్రధాని మాట్లాడుతూ.. నాయర్ చేసిన సేవల గురించి ప్రజలు తెలుసుకోవాలని కోరారు.
బ్రిటీషర్ల క్రూరత్వానికి జలియన్‌వాలాబాగ్ ఓ నిదర్శనమని, కానీ ఆ సమయంలో జరిగిన ఓ విషయాన్ని దాచిపెట్టారని, మానవత్వ స్పూర్తిని, దేశ ఐక్యత కోసం పోరాటం చేసిన శంకరన్ నాయర్‌ని మోదీ గుర్తు చేశారు. చాలా మందికి ఆయన పేరు తెలిసి ఉండదని, కానీ ఇటీవల ఆయన గురించి మాట్లాడుతున్నారని, నాయర్ జీ ఓ ఫేమస్ లాయర్ అని, బ్రిటీష్ ప్రభుత్వంలో ఆయన ఓ ఉన్నత పదవిలో కొనసాగారని, కానీ ఆయన బ్రిటీషర్ల అధికారాన్ని, విలాసాలను వదిలివేశారని ప్రధాని తెలిపారు.
జలియన్‌వాలాబాగ్ ఘటన తర్వాత బ్రిటీషర్లకు వ్యతిరేకంగా ఆయన నిలిచారని, ఆ ఊచకోతను ఖండిస్తూ ఆయన తన స్వరం విప్పారని మోదీ చెప్పారు. బ్రిటీషర్ల ఉద్యోగాన్ని వదిలేసినట్లు తెలిపారు. శంకరన్ నాయర్ కేరళ వ్యక్తి అని, కానీ జలియన్‌వాలాబాగ్ ఘటన పంజాబ్‌లో జరిగిందని, ఆ ఊచకోతను ఖండిస్తూ ఆయన న్యాయ పోరాటం చేశారని, బ్రిటీష్ ప్రభుత్వ పునాదుల్ని ఆయన కదిలించారని మోదీ తెలిపారు. ఆ అంశంపై బ్రిటీష్ ప్రభుత్వాన్ని కోర్టుకీడ్చారని తెలిపారు. అది మానత్వాన్ని చాటే కేసు మాత్రమే కాదు అని.. ఏక్ భారత్, శ్రేష్ట భారత్ నినాదానికి ఇది సూచకంగా నిలుస్తుందని మోదీ తెలిపారు.
పంజాబ్‌లో జరిగిన ఘటన గురించి కేరళ వ్యక్తి ఎలా పోరాడారని ప్రశ్నించారు. అదే నిజమైన స్పూర్తి అని, అదే ప్రేరణ అని, స్వాతంత్రోద్యమానికి ఆ పోరాటమే స్పూర్తిగా నిలిచిందన్నారు.వికసిత భారత్ జర్నీలో ఇదే బలమని పేర్కొన్నారు.శంకరన్ నాయర్ చేసిన సమాజ సేవ గురించి అందరూ తెలుసుకోవాలని, పంజాబ్.. హర్యానా, హిమాచల్ ప్రదేశ్‌లో ఉండే ప్రతి పిల్లవాడు ఆయన గురించి తెలుసుకోవాని మోదీ తెలిపారు. శంకరన్ నాయర్ జీవిత కథ ఆధారంగా హిందీలో కేసరి-2 చిత్రాన్ని నిర్మించారు. ఆ ఫిల్మ్ ఈ నెల చివరలో రిలీజ్ కానున్నది. ఈ నేపథ్యంలో శంకరన్ నాయర్ జీవిత గురించి తెలుసుకోవాలని కూడా మోదీ కోరారు.
బ్రిటీషర్లు తెచ్చిన రోవాల్ట్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ వేలాది మంది భారతీయులు ఏప్రిల్ 13, 1919లో అమృత్‌సర్‌లోని జలియన్వాలాభాగ్లో సమావేశం అయ్యారు. అయితే బ్రిటీష్ దళాలు జరిపిన కాల్పుల్లో వందల సంఖ్యలో జనం చనిపోయారు.
Honourable PM Modi Ji pays tribute to Sankaran Nair who @akshaykumar sir will soon be seen playing the role of in Kesari chapter 2 💪🏻♥️ proud moment! #kesari2 #akshaykumarlive #akshaykumarfans #akshaykumarofficials #akshaykumarnews #akshaykumarteam #akshaykumarupdates pic.twitter.com/GFNBKlHNgU
— AK Army (@itsakarmy_) April 14, 2025