న్యూఢిల్లీ : 150 ఏళ్ల ‘వందే మాతరం’ స్మారక ఉత్సవాలను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం ప్రారంభించారు. ఇందిరా గాంధీ ఇండోర్ స్టేడియంలో జరిగిన కార్యక్రమంలో ఆయన స్మారక స్టాంప్‌ను, నాణేన్ని విడుదల చేశారు. బంకింగ్ చంద్ర ఛటర్జీ 1875లో అక్షయ నవమి సందర్భంగా ‘వందే మాతరం’ను రాశారు. ఆ రోజు ఆ సంవత్సరంలో నవంబరు 7న వచ్చింది.
ఈ నేపథ్యంలో ఈ ఏడాది నవంబరు 7 నుంచి వచ్చే సంవత్సరం నవంబరు 7 వరకు దేశవ్యాప్తంగా స్మారకోత్సవాలను నిర్వహిస్తారు. భారత దేశ స్వాతంత్య్ర సమరంలో ఈ గీతం అందరికీ ప్రేరణనిచ్చింది. ఇది బంకింగ్ చంద్ర రాసిన ‘ఆనంద్‌మఠ్’ నవలలో భాగం.