PM Modi : ప్రధాని (Prime Minister) నరేంద్రమోదీ (Narendra Modi) మూడు దేశాల పర్యటన సోమవారం మొదలైంది. ఈ పర్యటనలో భాగంగా ఆయన ముందుగా జోర్డాన్ (Jordan) లోని అమ్మాన్ (Ammaan) కు చేరుకున్నారు. అమ్మాన్ విమానాశ్రయంలో జోర్డాన్ ప్రధాని (Jordan PM) జాఫర్ హసన్ (Jafar Hassan) స్వయంగా ప్రధాని మోదీకి స్వాగతం పలికి ప్రత్యేక గౌరవం కల్పించారు.
మోదీ తన మూడు రోజుల పర్యటనలో భాగంగా జోర్డాన్ తర్వాత ఇథియోపియా, ఒమన్ దేశాలను సందర్శించనున్నారు. భారత్-జోర్డాన్ మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి 75 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో ఈ పర్యటన చారిత్రక ప్రాధాన్యత సంతరించుకుంది. 37 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత భారత ప్రధాని జోర్డాన్‌లో పూర్తిస్థాయి ద్వైపాక్షిక పర్యటన చేపట్టడం ఇదే తొలిసారి.
తన రెండు రోజుల పర్యటనలో ప్రధాని మోదీ.. జోర్డాన్ రాజు అబ్దుల్లా ఇబ్న్ అల్ హుస్సేన్‌తో సమావేశమై ద్వైపాక్షిక, ప్రాంతీయ అంశాలపై విస్తృతంగా చర్చించనున్నారు. అలాగే ప్రధాని జాఫర్ హసన్, యువరాజు అల్ హుస్సేన్ బిన్ అబ్దుల్లాతోనూ భేటీ కానున్నారు. ఉగ్రవాదంపై పోరాటంలో ఇరుదేశాలు పరస్పరం సహకరించుకుంటున్నాయి.
ఇటీవల జరిగిన పహల్గాం ఉగ్రదాడిని జోర్డాన్ రాజు తీవ్రంగా ఖండించారు. ఉగ్రవాదాన్ని అన్ని రూపాల్లో తిరస్కరించాలని స్పష్టంచేశారు. ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు కూడా బలంగా ఉన్నాయి. జోర్డాన్‌కు భారత్ మూడో అతిపెద్ద వాణిజ్య భాగస్వామి కాగా, ద్వైపాక్షిక వాణిజ్యం 2.8 బిలియన్ డాలర్లుగా ఉంది. కాగా జోర్డాన్‌లోని భారత సమాజం సైతం మోదీకి ఘనస్వాగతం పలికింది.