PM Modi-Putin Talk | ప్రధాని మోదీకి రష్యా అధ్యక్షుడు పుతిన్ ఫోన్.. అలాస్కా భేటీపై నేతల చర్చ..!
PM Modi-Putin Talk | రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేశారు. ఈ సందర్భంగా ట్రంప్‌తో అలాస్కాలో జరిగిన సమావేశం గురించి ప్రధాని మోదీకి వివరించారు. ప్రధాని మోదీ సోషల్ మీడియా వేదికగా పుతిన్‌తో జరిగిన సంభాషణ గురించి వెల్లడించారు.
PM Modi-Putin Talk | రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేశారు. ఈ సందర్భంగా ట్రంప్‌తో అలాస్కాలో జరిగిన సమావేశం గురించి ప్రధాని మోదీకి వివరించారు. ప్రధాని మోదీ సోషల్ మీడియా వేదికగా పుతిన్‌తో జరిగిన సంభాషణ గురించి వెల్లడించారు. ట్రంప్‌తో జరిగిన సమావేశం గురించి సమాచారాన్ని తెలియజేసినందుకు పుతిన్‌కు మోదీ ధన్యవాదాలు తెలిపారు. ఉక్రెయిన్ వివాదాన్ని శాంతియుతంగా పరిష్కరించుకోవాలని భారత్ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ విషయంలో భారత్ అన్ని ప్రయత్నాలకు మద్దతు ఇస్తుందని.. రాబోయే రోజుల్లో చర్చల కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆగస్టు 15న అలాస్కాలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో సమావేశమైన విషయం తెలిసిందే.
ఈ భేటీలో కాల్పుల విరమణపై చర్చించారు. అయితే, రష్యా-ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో కాల్పుల విరమణ అమలుపై ఏకాభిప్రాయానికి రాలేదు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రష్యా నుంచి చమురు కొనుగోలు కోసం భారతదేశంపై 50 శాతం సుంకం విధించిన సమయంలో సమావేశం జరిగింది. సుంకాలపై భారత్ తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు. అగ్రరాజ్యం చర్యలు అన్యాయం, అసంబద్ధమని పేర్కొంది. అయితే, జాతీయ ప్రయోజనాలను కాపాడుకునేందుకు చర్యలు తీసుకుంటామని భారత విదేశాంగ మంత్రిత్వశాఖ తెలిపింది. రష్యా అధ్యక్షుడు, ప్రధాని మోదీ మధ్య జరిగిన సంభాషణలను పరిశీలిస్తే.. అమెరికా సుంకాలకు వ్యతిరేకంగా రష్యా భారత్‌తోనే ఉందని స్పష్టంగా తెలుస్తున్నది.
పుతిన్-ట్రంప్ సమావేశం భారత్‌పై ప్రభావం అసంపూర్ణంగా ఉన్నాయి. రష్యా నుంచి చమురు కొనుగోలు కోసం భారత్‌పై తాను విధించిన 25 శాతం అదనపు సుంకం ప్రభావం కనిపించిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనేక సందర్భాల్లో చెప్పారు. పుతిన్-ట్రంప్ మధ్య చర్చలు ఎలాంటి ఫలితాలను ఇవ్వకపోతే.. భారత్ మరిన్ని సుంకాలకు సిద్ధంగా ఉండాలని ట్రంప్ ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ హెచ్చరించారు. ఈ పరిస్థితుల్లో అలాస్కా సమావేశం తర్వాత భారతదేశం అతిపెద్ద ఎగుమతి కేంద్రం (అమెరికా)తో వాణిజ్య వివాదం మరింత కొనసాగే అవకాశం ఉంది. అయితే, డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ఒక ప్రశ్నకు సమాధానంగా భారత్‌పై మరిన్ని సుంకాలు విధించాల్సి వస్తే.. తాను ఖచ్చితంగా చేస్తానని, అలా చేయాల్సిన అవసరం లేకపోవచ్చునని పేర్కొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

