గ్యాంగ్టాక్: ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఫుల్బాల్ ఆడారు. రెండు రోజుల పాటు సిక్కం పర్యటనలో ఉన్న ఆయన ఇవాళ ఉదయం గ్యాంగ్‌టక్‌లో పిల్లలతో కలిసి ఫుట్‌బాల్ ఆడారు. అమ్మాయిలు, అబ్బాయిలు ఆ గేమ్‌లో పాల్గొన్నారు. చాలా ఉత్సాహభరితంగా ఉన్నట్లు మోదీ పేర్కొన్నారు. పిల్లలతో కలిసి ఫుట్‌బాల్ ఆడిన పిక్స్, వీడియోను ఆయన తన ఎక్స్ అకౌంట్లో షేర్ చేశారు. ఫుట్‌బాల్ ఆటతో పాటు పిల్లల్లో మానసిక ధైర్యాన్ని నింపారు. గోల్ పోస్టు వద్ద ఆయన గోల్ కొట్టే ప్రయత్నం చేశారు. సిక్కింలో యువ స్నేహితులతో కలిసి ఫుట్‌బాల్ ఆడడం కన్నా మరోటి లేదని తన ట్వీట్లో తెలిపారు. యువతతో ఫుట్‌బాల్ ఆడడం ఉత్సాహాన్నిస్తున్నదన్నారు.
A football morning in Gangtok! We learnt, we played, we celebrated and above everything else, we enjoyed the game…. pic.twitter.com/rZ0jLey5u7
— Narendra Modi (@narendramodi) April 28, 2026