న్యూఢిల్లీ: సహకార రంగంలో ప్రపంచంలోనే అతిపెద్ద ఆహార ధాన్యాల నిల్వ పథకాన్ని శనివారం ప్రధాని మోదీ ప్రారంభించారు. వచ్చే ఐదేండ్లలో రూ.1.25 లక్షల కోట్ల పెట్టుబడితో 700 లక్షల టన్నుల ఆహార నిల్వ సామర్థ్యాన్ని సృష్టిస్తామని ప్రకటించారు. 11 రాష్ర్టాల్లో 11 ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు ఏర్పాటు చేసిన 11 గోదాములను కేంద్రం ప్రారంభించింది. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా గోదాములను నిర్మించనున్నామని కేంద్రం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది.