బలోత్రా: రాజస్థాన్‌లోని బలోత్రా జిల్లాలో ఇవాళ పాచపద్ర రిఫైనరీని ప్రధాని మోదీ(PM Modi) ప్రారంభించారు. దేశంలోని తొట్టతొలి గ్రీన్‌ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ రిఫైరీ కమ్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్‌ను ఆయన జాతికి అంకితం చేశారు. భారతీయ ఇంధన, పెట్రో కెమికల్ రంగంలో ఇది కీలమైన మైలురాయి అని పేర్కొన్నారు. రిఫైనరీ కాంప్లెక్స్ టూర్ చేసిన తర్వాత ఆయన రిమోట్ బటన్ నొక్కి ప్రాజెక్టును ప్రారంభించారు. ప్రతి ఏడాది ఆ రిఫైనరీలో సుమారు 2.4 మిలియన్ మెట్రిక్ టన్నుల పెట్రోకెమికల్ ఉత్పత్తులను రిఫైన్ చేయనున్నారు. అంతకముందు ఆయన జోధ్‌పూర్ ఎయిర్‌పోర్టులో కొత్త టర్మినల్‌ను ఓపెన్ చేశారు. కొత్త ఉడాన్ స్కీమ్‌ను ఆవిష్కరించారు. రాబోయే పదేళ్ల కోసం 29 వేల కోట్లు కేటాయించారు.ఇంకా జైపూర్ మెట్రో రైల్ ప్రాజెక్టు కోసం కూడా ఆయన శంకుస్థాపన చేశారు. 13వేల కోట్లు ఆ ప్రాజెక్టు కోసం ఖర్చు చేయనున్నారు. కొన్ని రైల్వే ప్రాజెక్టులకు కూడా ఆయన శంకుస్థాపన చేశారు.
VIDEO | Rajasthan: PM Modi (@narendramodi) visited the first greenfield integrated refinery-cum-petrochemical complex in Balotra.
(Source: Third Party)#Rajasthan pic.twitter.com/NsfSW5s5Jy
— Press Trust of India (@PTI_News) July 4, 2026