PM Modi | మౌనమేల మోదీ.. కీలకాంశాలపై స్పందించని ప్రధాని
‘ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేసే శక్తులు ఇప్పుడు బలం పుంజుకున్నాయి. దేశంలో ఎమర్జెన్సీ మళ్లీ రాబోదని నేను అనుకోవట్లేదు’.. 2015లో ‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్'కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో బీజేపీ కురువృద్ధుడు ఎల్కే అద్వానీ చేసిన వ్యాఖ్యలివి.
- దేశంలో సంచలనంగా ఎనిమిది కీలకాంశాలు
- విపక్షాలు ప్రశ్నించినా స్పందించని ప్రధాని మోదీ
- ప్రశ్నించిన వారిపై ఎదురుదాడి, కక్ష సాధింపు
- జాబితాలో పుల్వామా దాడి , అదానీ వివాదం..
- చైనా దురాక్రమణ, కర్ణాటకలో 40% కమీషన్..
- నోట్ల రద్దు, కొవిడ్ మరణాలు, గుజరాత్ అల్లర్లు
- వివిధ సూచీల్లో దిగజారిన భారత్ ర్యాంకులు
‘ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేసే శక్తులు ఇప్పుడు బలం పుంజుకున్నాయి. దేశంలో ఎమర్జెన్సీ మళ్లీ రాబోదని నేను అనుకోవట్లేదు’.. 2015లో ‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్’కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో బీజేపీ కురువృద్ధుడు ఎల్కే అద్వానీ చేసిన వ్యాఖ్యలివి. ప్రధాని నరేంద్ర మోదీ తొమ్మిదేండ్ల పాలనలో అత్యవసర స్థితి నాటి చీకటి రోజులు ప్రస్తుతం నెలకొన్నాయి.
(స్పెషల్ టాస్క్ బ్యూరో)
PM Modi | హైదరాబాద్, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ): తొమ్మిదేండ్ల బీజేపీ పాలనలో ప్రజాస్వామ్య ధ్వంసరచన అప్రతిహతంగా కొనసాగుతున్నది. కేంద్రం అరాచకాలను ప్రశ్నించిన గొంతుకలను పిసికి వేయడం పరిపాటిగా మారింది. 2002 గుజరాత్ అల్లర్ల ఘటన నుంచి నిన్నటి అదానీ వివాదం వరకూ ప్రతీ అంశం ఇందుకు మినహాయింపు కాదు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 8 అంశాలపై ప్రతిపక్షాలు పెద్దయెత్తున నిరసనలు వ్యక్తం చేస్తున్నప్పటికీ, ప్రధాని మోదీ మౌనముద్రనే ఆశ్రయిస్తుండటం చర్చనీయాంశంగా మారింది.
చైనా దురాక్రమణ: లఢక్, అరుణాచల్ ప్రదేశ్‌లో చైనా దురాక్రమణకు పాల్పడుతున్నా.. కేంద్రం నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరిస్తున్నది. చైనాది పెద్ద ఎకానమీ అని, అలాంటి వాళ్లతో యుద్ధంలో మనం ఎలా గెలవగలమని విదేశాంగమంత్రి జైశంకర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి.
పుల్వామా ఘటన: పుల్వామా ఉగ్రదాడిలో 40 మంది సైనికులు అమరులవ్వడానికి కేంద్రమే కారణమని, జవాన్ల మరణాలను మోదీ ఎన్నికల ప్రయోజనాలకు వాడుకొన్నారని జమ్ముకశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో ఓ కేసులో ఆయనకు సీబీఐ నోటీసులు జారీ చేసింది.
అదానీ వివాదం: హిండెన్‌బర్గ్ ఆరోపణలు, అదానీ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ పడిపోవడం, అదానీ-మోదీ బంధం తదితర అంశాలను ఉటంకిస్తూ పార్లమెంట్లో కాంగ్రెస్ నేత రాహుల్.. ప్రధానిని ప్రత్యక్షంగా టార్గెట్ చేశారు. అనంతరం మోదీ’ ఇంటి పేరు కేసులో రాహుల్‌ను కోర్టు దోషిగా తేల్చి లోక్‌సభ సభ్యత్వం రద్దు చేసింది.
సూచీల్లో భారత్ ర్యాంకు: గడిచిన తొమ్మిదేండ్ల బీజేపీ పాలనలో ఆకలి సూచీ, హ్యాపీనెస్ ఇండెక్స్, పత్రికా స్వేచ్ఛ, సమానత్వ సూచీ, పర్యావరణం, మానవాభివృద్ధి, అవినీతిలేమి, పింఛన్ ఇలా 12 సూచీల్లో భారత్ ర్యాంకు మరింతగా దిగజారిపోయింది.
గుజరాత్ అల్లర్లు:

2002 గుజరాత్ అల్లర్లలో ప్రధాని నరేంద్రమోదీ పాత్రపై బీబీసీ రెండు సిరీస్‌లలో సంచలన డాక్యుమెంటరీని ప్రసారం చేసింది. అనంతరం భారత్‌లోని బీబీసీ కార్యాలయాలపై ఐటీ సోదాలు నిర్వహించింది. గుజరాత్ అల్లర్లు ఉద్దేశపూర్వకమైనవేనంటూ నివేదికను ఇచ్చిన మాజీ ఐపీఎస్ అధికారి సంజీవ్భట్ను ఓ లాకప్‌డెత్ కేసులో అరెస్టు చేశారు. కోర్టు ఆయనకు యావజ్జీవ శిక్ష విధించింది.
పెద్దనోట్ల రద్దు:

నల్లధనం వెనక్కి తీసుకొస్తానంటూ 2016లో ప్రధాని మోదీ తీసుకొన్న పెద్ద నోట్ల రద్దు నిర్ణయం అతిపెద్ద వైఫల్యమని తేలింది. నోట్ల రద్దు తర్వాత బ్యాంకులకు 99.3 శాతం విలువైన నోట్లు తిరిగొచ్చినట్టు ఆర్బీఐ వెల్లడించింది. అయితే, ఈ ఏకపక్ష నిర్ణయంతో ఆర్థిక వ్యవస్థకు రూ. 5 లక్షల కోట్ల నష్టంతో పాటు ఏటీఎంల ముందు క్యూలైన్లలో నిలబడలేక, ఇతరత్రా కారణాలతో 108 మంది మరణించారు.
40 శాతం కమీషన్ రాజ్:

కర్ణాటకలోని బీజేపీ ప్రభుత్వంలో అవినీతి పరాకాష్టకు చేరింది. ప్రజాప్రతినిధుల అధికార దాహానికి పలువురు కాంట్రాక్టర్లు ఆత్మహత్య చేసుకొన్న ఘటనలు దేశవ్యాప్తంగా సంచలనంగా మారాయి. అయితే, దీనిపై ప్రధాని ఇప్పటివరకూ నోరుమెదపలేదు.
కొవిడ్ మరణాలు:

భారత్‌లో కరోనా మరణాల లెక్కలను కేంద్రప్రభుత్వం తక్కువ చేసి చూపిస్తున్నదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) కిందటేడాది ఆరోపించింది. ప్రభుత్వ గణాంకాల కంటే 10 రెట్లు ఎక్కువ మరణాలు సంభవించినట్టు తెలిపింది. ఈ ఆరోపణలను భారత్ ఖండించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్‌కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

