శ్రీహరికోట: హైదరాబాద్‌కు చెందిన స్కైరూట్ ఏరోస్పేస్ కంపెనీ ఇవాళ శ్రీహరికోట నుంచి విక్రమ్1 రాకెట్‌ను నింగిలోకి పంపిన విషయం తెలిసిందే. ఆ ప్రయోగం పట్ల ప్రధాని మోదీ(PM Modi) హర్షం వ్యక్తం చేశారు. కక్ష్యలోకి ఉపగ్రహాలు, పేలోడ్స్ చేరుకున్న తర్వాత.. ప్రధాని మోదీ ఆ కంపెనీ ఓనర్లకు ఫోన్ చేసి మాట్లాడారు. భారత స్వయం సమృద్ధిని ఈ ప్రయోగం చాటుతుందని ఆయన అన్నారు. స్కైరూట్ ఏరోస్పేస్ ఈసీవో పవన్ కుమార్ చందన, సహ వ్యవస్థాపకుడు నాగ భరత్ డాకాతో ఆయన ఫోన్లో మాట్లాడారు. విక్రమ్1 ప్రయోగం సక్సెస్ అయిన నేపథ్యంలో ఆ ఇద్దరికీ, వాళ్ల కంపెనీకి ఆయన కంగ్రాట్స్ చెప్పారు.
రాకెట్ లాంచింగ్ సమయంలో ఆ ఇద్దరూ ఇస్రోని మిషన్ కంట్రోల్ సెంటర్లో ఉన్నారు. మిషన్ ఆగమనం మరింత ముందుకు వెళ్తుందని ప్రధాని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ మిషన్‌తో మనం ఆత్మనిర్భర్ అని నిరూపించుకున్నామన్నారు. రాకెట్ పూర్తి ఇండియాలోనే డిజైన్ చేసి, తయారు చేసినట్లు చందన తెలిపారు. ప్రయోగం సందర్భంగా బెస్ట్ విషెస్ చెబుతూ వందేమాతరం లేఖను మోదీ రాసిన విషయం తెలిసిందే. అయితే ఆ లేఖ విజయవంతంగా కక్ష్యలోకి చేరినట్లు స్కైరూట్ సీఈవో తెలిపారు. భారతీయ అంతరిక్ష ప్రయాణంలో ఇది అత్యంత ముఖ్యమైన సందర్భమన్నారు.
ప్రైవేటు రంగంలో కొత్త భాగస్వామ్యుల పాత్ర పెరుగుతోందని, దీంతో ఆవిష్కరణలు ఊపందుకున్నట్లు మోదీ తెలిపారు. ఈ ఘనత అనేక మంది భారతీయ యువతలో ప్రేరణ నింపుతుందని, దీంతో ఆ యువత తమ కలలను సాకారం చేసుకునే సందర్భం వస్తుందన్నారు. నిర్భయంగా యువత తమ ఆవిష్కరణలకు రూపం ఇవ్వనున్నట్లు ప్రధాని తన ఎక్స్ అకౌంట్లో తెలిపారు.
Spoke to the team of Skyroot Aerospace and congratulated them on the successful launch of Vikram-1.
This is a defining moment in India’s space journey. The growing participation of our private sector is opening new frontiers and accelerating innovation.
This achievement will… pic.twitter.com/epWjOY8yKa
— Narendra Modi (@narendramodi) July 18, 2026