న్యూఢిల్లీ: పారాలింపిక్స్‌లో భారత్‌కు మరో పతకాన్ని అందించిన హైజంపర్ ప్రవీణ్ కుమార్‌ను ప్రధాని మోదీ అభినందించారు. అతని కృషి, పట్టుదలకు ఈ పతకమే నిదర్శనమని చెప్పారు. ఈ మేరకు ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ‘పారాలింపిక్స్‌లో ప్రవీణ్ కుమార్ రజత పతకం సాధించినందుకు గర్వపడుతున్నాను. ఈ పతకం అతని కృషి, అసమానమైన అంకితభావానికి నిదర్శనం. ప్రవీణ్ కుమార్‌కు అభినందనలు. భవిష్యత్‌లో అతను చేసే ప్రయత్నాలకు శుభాకాంక్షలు’ అని ప్రధాని మోదీ ట్విటర్ ద్వారా అభినందించారు.
"Proud of Praveen Kumar for winning the Silver medal at the #Paralympics. This medal is the result of his hard work and unparalleled dedication. Congratulations to him. Best wishes for his future endeavours," tweets PM Narendra Modi pic.twitter.com/7reOApbo9N
— ANI (@ANI) September 3, 2021
టోక్యోలో జరుగుతున్న పారాలింపిక్స్ పురుషుల హైజంప్ విభాగంలో భారత హైజంపర్ ప్రవీణ్ కుమార్ సిల్వర్ మెడల్ సాధించాడు. బంగారు పతకం కోసం జరిగిన ఫైనల్లో గ్రేట్ బ్రిటన్‌కు చెందిన జోనాథన్ ఎడ్వర్డ్స్ 2.10 మీటర్లు ఎత్తు ఎగిరాడు. అయితే ప్రవీణ్ దీనిని అందుకోవడంలో విఫలమయ్యాడు. దీంతో జొనాథన్ బంగారు పతకం సాధించగా, ప్రవీణ్ కుమార్ (2.07 మీ.) రజతంతో సరిపెట్టుకున్నాడు.
ప్రవీణ్ కుమార్ సిల్వర్ మెడల్‌తో పారాలింపిక్స్‌లో భారత్ పతకాల సంఖ్య 11కు చెరింది. ఇందులో రెండు బంగారు (అవని లెఖారా, సుమిత్), ఆరు సిల్వర్ (ప్రవీణ్ కుమార్, మరియప్ప తంగవేల్, దేవేంద్ర ఝజారియా, యోగేష్ కథునియా, నిషద్ కుమార్, భవీనాబెన్ పటేల్) , మూడు వెండి (శరద్ కుమార్, సిఘ్రాజ్ అధనా, సుందర్ సింగ్ గుర్జర్) మెడల్స్ ఉన్నాయి.