ట్రంప్‌నకు భారత ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ‘చారిత్రక విజయాన్ని సాధించిన నా స్నేహితుడికి హృదయపూర్వక శుభాకాంక్షలు. భారత్ – అమెరికా భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు వేచి చూస్తున్నా.
మన ప్రజల అభ్యున్నతి కోసం, ప్రపంచ శాంతి, సుస్థిరత, శ్రేయస్సుని ప్రోత్సహించేందుకు కలిసికట్టుగా పని చేద్దాం’ అంటూ మోదీ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. అనేక దేశాధినేతలు సైతం ట్రంప్‌నకు శుభాకాంక్షలు తెలిపారు.