న్యూఢిల్లీ: ఇజ్రాయిల్-హమాస్ యుద్ధంలో మృతిచెందిన పౌరుల కుటుంబాలకు ప్రధాని మోదీ(PM Modi) సంతాపం తెలిపారు. పశ్చిమాసియాలో జరుగుతున్న హింసకు అంతం పలకాలంటే ఐక్యత, సహకారం అవసరం అని ఆయన అన్నారు. గ్లోబల్ సౌత్ సమ్మిట్ మీటింగ్‌లో ఇవాళ ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ఉగ్రవాదానికి, హింసకు భారత్ వ్యతిరేకంగా ఉందన్నారు. అక్టోబర్ 7వ తేదీన ఇజ్రాయిల్‌పై హమాస్ చేసిన దాడి కూడా ఆయన ఖండించారు.
యుద్ధం వేళ సమయమనం పాటిలంచాలని, సమస్యను పరిష్కరించేందుకు చర్చలు చేపట్టాలని ప్రధాని మోదీ తెలిపారు. పశ్చిమాసియా ప్రాంతం నుంచి కొత్త సవాళ్లు ఎదురవుతున్నాయని, అక్టోబర్ 7వ తేదీన జరిగిన ఉగ్ర దాడిని భారత్ ఖండించిందని ప్రధాని తెలిపారు. పాలస్తీనా అధ్యక్షుడు అబ్బాస్‌తో చర్చించిన తర్వాత ఆ దేశానికి మానవ సాయాన్ని పంపించామని ఆయన వెల్లడించారు.
ప్రపంచ శాంతి కోసం గ్లోబల్ సౌత్‌కు చెందిన దేశాలు ఒక్కటి కావాలన్నారు. దక్షిణ ద్రువానికి చెందిన దేశాలను గ్లోబల్ సౌత్‌గా పరిగణిస్తారు. దీంట్లో ఆసియా, ఆఫ్రికా, దక్షిణ అమెరికా దేశాలు ఉంటాయి.