న్యూఢిల్లీ: అయోధ్యలో రామాలయ ప్రారంభం తర్వాత ప్రధాని మోదీ ఓ కొత్త పథకాన్ని ప్రకటించారు. అయోధ్య నుంచి ఢిల్లీ వెళ్లిన వెంటనే ‘ప్రధాన మంత్రి సూర్యోదయ యోజన’ను ప్రారంభిస్తున్నట్టు ఆయన తెలిపారు. కోటి ఇళ్లపైన రూఫ్‌టాప్ సోలార్‌ను అమర్చాలనేది లక్ష్యమని చెప్పా రు. అయోధ్య నుంచి ఢిల్లీకి వచ్చిన వెంటనే తీసుకున్న తొలి నిర్ణయం ఇదేనని చెప్పారు. ఈ నిర్ణయం వల్ల పేద, మధ్య తరగతి ప్రజల కరెంటు బిల్లుల ఖర్చు తగ్గడమే కాకుండా, భారత దేశం ఇంధన రంగంలో స్వయం సమృద్ధం అవుతుందన్నారు.