న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం కిసాన్) యోజన పథకం 21వ వాయిదా సొమ్ము ఈ నెల 19న రైతన్నల బ్యాంకు ఖాతాలకు జమ అవుతుంది. ఈ సొమ్మును ప్రధాని మోదీ విడుదల చేస్తారని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ శుక్రవారం తెలిపారు.
ఈ పథకం క్రింద అర్హులైన అన్నదాతలకు సంవత్సరానికి రూ.6,000 మూడు విడతల్లో అందజేస్తున్న సంగతి తెలిసిందే.