PMGKAY | ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్నయోజన (PMGKAY)తో పాటు ఇతర సంక్షేమ పథకాల కింద ఫోర్టిఫైడ్ బియ్య పంపిణీ కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. 2028 డిసెంబర్ వరకు ఉచితంగా ఫోర్టిఫైడ్ బియ్యం సరఫరా చేసేందుకు బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. పీఎంజీకేఏవైలో భాగంగా కేంద్రం వందశాతం నిధులతో పోషకాహారం అందించేందుకు ఫ్టోర్టిఫైడ్ రైస్‌ని అందించేందుకు చర్యలు చేపట్టింది. 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రకటన మేరకు కేందినెట్ నిర్ణయం తీసుకున్నది. లక్ష్యిత ప్రజాపంపిణీ వ్యవస్థ (TPDS), ఇతర సంక్షేమ పథకాలు, సమగ్ర శిశు అభివృద్ధి సేవ (ICDS) అంతటా బలవర్థకమైన బియ్యం సరఫరా, దేశంలో రక్తహీనత, సూక్ష్మపోషకాల లోపాలను అరికట్టేందుకు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో పీఎం పోషన్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
ఏప్రిల్ 2022లో ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (CCEA) మార్చి 2024 నాటికి ఇప్పటికే మూడు విడుతలుగా విజయవంతంగా పూర్తయ్యాయి. ఈ పథకానికి కేంద్ర ప్రభుత్వం రూ.17,082కోట్లు ఖర్చు చేయనున్నది. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) ప్రకారం.. సాధారణ బియ్యంలో పోషకాలను జోడించి ఫోర్టిఫైడ్ రైస్ తయారు చేస్తారు. ప్రజల ఆహార అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ సూక్ష్మపోషకాలు జోడిస్తారు. ఈ సందర్భంగా కేంద్ర కేబినెట్ లోథాల్లో నేషనల్ మారిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్ అభివృద్ధికి ఆమోదం తెలిపింది. రాజస్థాన్, పంజాబ్ దేశ సరిహద్దు ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణానికి కేబినెట్ ఆమోద ముద్రవేసింది. రూ.4,406కోట్లతో 2,208 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణానికి కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది.