బెంగళూరు: కర్ణాటకలో కరోనా మహమ్మారి కలకలం సృష్టించింది. చిక్మంగళూరు జిల్లాలోని జీవన్‌జ్యోతి ఉన్నత పాఠశాలలో టీచర్‌కు, 10 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ వచ్చింది. దాంతో అధికారులు స్కూల్ బిల్డింగ్‌ను సీల్ చేశారు. ఆ స్కూల్ పరిసర ప్రాంతాలను కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటించారు. స్కూల్లో విద్యార్థులు, టీచర్లు, నాన్-టీచింగ్ స్టాఫ్‌తో కలిపి మొత్తం 470 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేశామని చిక్మంగళూరు జిల్లా వైద్యాధికారి డాక్టర్ ఉమేశ్ తెలిపారు.
మొత్తం 470 మందిలో ఒక టీచర్, 10 మంది విద్యార్థులకు వైరస్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని ఉమేశ్ చెప్పారు. అయితే, ఆ 11 మందిలో వ్యాధి లక్షణాలేవీ లేవని, ప్రస్తుతం అందరూ హోమ్ క్వారెంటైన్లో ఉన్నారని వెల్లడించారు. దాంతో స్కూల్‌ను సీల్ చేసి, పరిస్థితిని పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. కాగా, స్కూల్ మూతపడినప్పటికీ విద్యార్థులకు ఆన్లైన్లో బోధన కొనసాగతుందని విద్యాశాఖ అధికారులు చెప్పారు.