Delhi Budget: ఢిల్లీ బడ్జెట్‌ను ఆపకండి.. ప్రధానికి లేఖ రాసిన కేజ్రీవాల్
Delhi budget: ఢిల్లీ బడ్జెట్‌పై గందరగోళం నెలకొన్నది. బడ్జెట్‌ను ప్రవేశపెట్టకుండా కేంద్రం అడ్డుకుంటోందని సీఎం కేజ్రీవాల్ ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఇవాళ ప్రధాని మోదీకి లేఖ రాశారు.
న్యూఢిల్లీ: ఢిల్లీ రాష్ట్ర బడ్జెట్(Delhi Budget)ను ఇవాళ ప్రవేశపెట్టకుండా నిలిపివేశారు. ఈ అంశంపై ప్రధాని మోదీ(PM Modi)కి ఆ రాష్ట్ర సీఎం కేజ్రీవాల్(Kejriwal) లేఖ రాశారు. ఢిల్లీ బడ్జెట్‌ను ఆపకండి అంటూ ఆయన తన లేఖలో ప్రధానిని అభ్యర్థించారు. ఆమ్ ఆద్మీ పార్టీ, కేంద్రం మధ్య వివాదం చెలరేగుతున్న నేపథ్యంలో .. ఆప్ సర్కార్ రాష్ట్ర బడ్జెట్‌ను నిలిపివేసింది. వివిధ రంగాల కేటాయింపుల(Allocations) విషయంలో కేంద్రం, ఢిల్లీ మధ్య వివాదం చెలరేగుతున్నట్లు తెలుస్తోంది.
గత 75 ఏళ్లలో తొలిసారి ఓ రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టకుండా అడ్డుకున్నారని కేజ్రీవాల్ ఆరోపించారు. ఢిల్లీ వాసుల(Delhi Public)తో మీరెందుకు ఇంత అప్సెట్గా ఉన్నారని, ప్లీజ్ ఢిల్లీ బడ్జెట్‌ను ఆపకండి, చేతులు జోడించి నమస్కరిస్తున్నా, బడ్జెట్‌ను ప్రవేశపెట్టాలని ఢిల్లీ ప్రజలు కోరుతున్నట్లు సీఎం కేజ్రీవాల్ తన లేఖలో తెలిపారు.
ఢిల్లీ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టకుండా కేంద్ర హోంశాఖ(Home Ministry) అడ్డుకున్నట్లు తెలుస్తోంది. అడ్వర్టైజ్మెంట్లకు అధిక కేటాయింపులు ఉన్నాయని, కానీ అభివృద్ధి పనులకు, మౌళిక సదుపాయాల కోసం కేటాయింపులు లేవని ఆప్ సర్కార్‌పై కేంద్రం ఆగ్రహంగా ఉంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- delhi budget
- Kejriwal
- Pm Modi
RELATED ARTICLES
తాజా వార్తలు
మెట్రోకు నష్టాల సెగ.. అర్థ సంవత్సరంలో రూ. 405 కోట్లకు పైగా లోటు
దూదేకుల స్థితిగతులపై ప్రత్యేక సర్వే
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

