న్యూఢిల్లీ : బెట్టింగ్, గ్యాంబ్లింగ్ లేకుండా వినోదం కోసం పేకాట ఆడటం అనైతికం కాదని సుప్రీంకోర్టు తెలిపింది. పేకాట అనేక రకాలుగా ఆడతారని, అన్ని రకాల పేకాటలను అనైతికమని అంగీకరించలేమని పేర్కొంది. మరీ ముఖ్యంగా సరదా, వినోదం కోసం ఆడినపుడు అనైతికమని చెప్పలేమని తెలిపింది.
మన దేశంలో చాలా చోట్ల సామాన్యుల వినోద సాధనంగా దీనిని పరిగణిస్తారని పేర్కొంది. కర్ణాటకకు చెందిన ఓ సహకార సోసైటీ అధ్యక్షుడిపై నమోదైన పేకాట కేసు విచారణలో కోర్టు ఈ తీర్పిచ్చింది.