న్యూఢిల్లీ: అడ్వర్టయిజింగ్ దిగ్గజం పీయూష్ పాండే (70) శుక్రవారం కన్నుమూశారు. ఆయన ఇన్ఫెక్షన్తో బాధపడుతూ, తుదిశ్వాస విడిచారు. ఆయన అంత్యక్రియలు శనివారం జరుగుతాయి. పాండే దాదాపు నాలుగు దశాబ్దాల నుంచి అడ్వర్టయిజింగ్ ఇండస్ట్రీలో ఉన్నారు. ఓగిల్వీ ఇండియాకు ఆయన చీఫ్ క్రియేటివ్ ఆఫీసర్, ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా పని చేశారు.
ఈ కంపెనీలో ఆయన 1982లో చేరారు. సన్లైట్ డిటర్జెంట్ కోసం ఆయన తన మొదటి అడ్వర్టయిజ్మెంట్ను రాశారు. ఆరేళ్ల తర్వాత ఓగిల్వీ కంపెనీ క్రియేటివ్ డిపార్ట్మెంట్లో చేరారు. ఫెవికాల్, ఏషియన్ పెయింట్స్, లూనా మోపెడ్, ఫార్చ్యూన్ ఆయిల్, మరికొన్ని ఇతర బ్రాండ్లకు అడ్వర్టయిజ్మెంట్లను రూపొందించారు. ఆయనకు 2016లో ‘పద్మశ్రీ’ లభించింది.