న్యూఢిల్లీ: కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ సోమవారం ఆకస్మికంగా అమెరికాకు బయలుదేరారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై పరస్పర సుంకాలు విధిస్తామని ఇటీవల ప్రకటించారు. ఈ నేపథ్యంలో పీయూష్ గోయల్ హడావిడిగా అమెరికాకు బయలుదేరారు. మే 8 వరకు ఆయన అక్కడే ఉండి యూఎస్ అధికారులతో అత్యవసర వాణిజ్య చర్చలు జరిపే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది.
ప్రతిపాదిత సుంకాల గురించి అగ్రదేశాన్ని స్పష్టత కోరటం, వాటివల్ల దేశంపై పడే ప్రభావాన్ని అంచనా వేయటంతో సహా సుంకాల తగ్గింపు, ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకోవటం..మొదలైనవి ఆయన అమెరికా పర్యటనలో ప్రధాన అంశాలుగా ఉన్నాయి. అమెరికా సుంకాల వల్ల భారత్ ఎగుమతులపై 7 బిలియన్ డాలర్ల వరకు నష్టం వాటిల్లుతుందని నిపుణులు అంచనా.