న్యూఢిల్లీ: ఢిల్లీ విమానాశ్రయం టెర్మినల్ 1 వద్ద ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ పైలట్ తనపై భౌతిక దాడికి పాల్పడినట్లు స్పైస్‌జెట్ ప్రయాణికుడు ఒకరు ఆరోపించారు. ఈ ఆరోపణలపై స్పందించిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ సదరు ఉద్యోగిని విధుల నుంచి తొలగిస్తూ విచారణకు ఆదేశించినట్లు తెలిపింది. సిబ్బంది మాత్రమే ఉపయోగించాల్సిన ఎంట్రీ ఇది..అంటూ పైలట్ తనపై భౌతికంగా దాడికి దిగాడని, దీంతో తనకు రక్తసిక్త గాయాలయ్యాయని దేవన్ అనే ప్రయాణికుడు చెప్పారు.