Mobile Phone | న్యూఢిల్లీ : మొబైల్ ఫోన్ చూస్తూ టాయిలెట్లో గంటల తరబడి గడిపేవాళ్లు తీవ్రమైన నొప్పితో కూడిన వ్యాధుల (పైల్స్, ఫిస్టులా) బారినపడతారని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా పైల్స్, ఫిస్టులా కేసులు పెరుగుతున్నాయని, ఇదొక ప్రధాన ఆరోగ్య సమస్యగా మారుతున్నదని ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. నీరు సరిపడా తాగకపోవడం, చిరుతిళ్లు ఎక్కువగా తినడం, టాయిలెట్లో ఎక్కువ సేపు గడపడం, శారీరక శ్రమలేని జీవనశైలే ఇందుకు కారణమని తెలిపారు. టాయిలెట్లో ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల మలద్వారంపై ఒత్తిడి పెరుగుతున్నదని పేర్కొన్నారు.