న్యూఢిల్లీ: ప్రభుత్వ అధికారులు, రాజ్యాంగ బద్ధ పదవుల్లో ఉన్నవారు చేసే వివక్ష, ద్వేష పూరిత వ్యాఖ్యలను నియంత్రించేలా మార్గ దర్శకాలను రూపొందించాలని పన్నెండు మంది సుప్రీంకోర్ట్‌లో సోమవారం పిటిషన్ దాఖలు చేశారు. కొందరు సీఎంలు, మంత్రులు ఇటీవల చేస్తున్న వ్యాఖ్యలు రాజ్యాంగ విలువలను, నైతికతను తగ్గించేలా ఉన్నాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు.