న్యూఢిల్లీ: రోడ్డు శుభ్రం చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులపైకి వ్యాన్ దూసుకెళ్లింది. ఈ సంఘటనలో ఆరుగురు పారిశుద్ధ్య కార్మికులు మరణించారు. (Sanitation Workers Killed) మరో ఐదుగురు గాయపడ్డారు. రోడ్డు పక్కన చెల్లాచెదురుగా పడి ఉన్న మృతదేహాలతో ఆ ప్రాంతం బీభత్సకరంగా మారింది. ఈ సంఘటన తర్వాత వ్యాన్ డ్రైవర్ అక్కడి నుంచి పారిపోయాడు. దేశ రాజధాని ఢిల్లీ శివారులో ఈ సంఘటన జరిగింది. శనివారం ఉదయం 10 గంటల సమయంలో హర్యానాలోని ఫిరోజ్‌పూర్ జిర్కాలోని ఇబ్రహీం బాస్ గ్రామం సమీపంలో ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్‌వేను కొందరు పారిశుద్ధ్య కార్మికులు క్లీనింగ్ చేస్తున్నారు.
కాగా, ఢిల్లీ నుంచి అల్వార్ వైపు వేగంతో వెళ్తున్న పికప్ వ్యాన్ అదుపుతప్పింది. రోడ్డు శుభ్రం చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులపైకి ఆ వాహనం దూసుకెళ్లి బోల్తా పడింది. వ్యాన్ డ్రైవర్ వెంటనే అక్కడి నుంచి పారిపోయాడు. ఈ ప్రమాదంలో ఆరుగురు పారిశుద్ధ్య సిబ్బంది మరణించారు. మరో ఐదుగురు గాయపడ్డారు. రోడ్డు పక్కన చెల్లాచెదురుగా పడి ఉన్న మృతదేహాలతో ఆ ప్రాంతం బీభత్సకరంగా మారింది.
మరోవైపు ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయడిన కార్మికులను హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. మరణించిన పారిశుద్ధ్య కార్మికుల్లో ఐదుగురు ఖేరీ కలాన్ గ్రామానికి చెందినవారని, ఒకరు జిమ్రావత్ గ్రామానికి చెందిన వ్యక్తి అని పోలీస్ అధికారి తెలిపారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నట్లు చెప్పారు. పారిపోయిన డ్రైవర్‌ను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.
#BreakingNews 7 estimated dead in majority accident on Delhi Mumbai Expressway. Early report claim it was sanitation workers working on highway when an overspending pickup rammed into them.@NHAI_Official @nitin_gadkari
worker safety? #AccidentsFatal #DelhiMumbaiExpressway pic.twitter.com/6UeQUkX6fv— Sumedha Sharma (@sumedhasharma86) April 26, 2025