లక్నో: ఒక మంత్రి ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించాడు. దివ్యాంగుడైన డాక్టర్ రోగులను చూడటంలో బిజీగా ఉన్నాడు. అయితే ఆ డాక్టర్ తనకు స్వాగతం చెప్పకపోవడంపై ఆ మంత్రి ఆగ్రహించాడు. ఆయనను అటవీ ప్రాంతానికి బదిలీ చేయాలని ఆదేశించాడు. (Minister Orders Doctor’s Transfer) బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్‌లోని సోన్‌భద్ర జిల్లాలో ఈ సంఘటన జరిగింది. సాంఘిక సంక్షేమం, షెడ్యూల్డ్ కులాలు, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంజీవ్ గోండ్, తన నియోజకవర్గం పరిధిలోని దిబుల్గంజ్లో ప్రభుత్వ ఆసుపత్రిని బుధవారం సందర్శించాడు. అక్కడ సోలార్ పవర్ ప్లాంట్‌ను ఆయన ప్రారంభించాడు. మంత్రి మద్దతుదారులు, పార్టీ కార్యకర్తలు ఆయనకు స్వాగతం పలికారు.
కాగా, ప్రభుత్వ ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రవి సింగ్ తనకు స్వాగతం చెప్పకపోవడంపై మంత్రి సంజీవ్ గోండ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆ తర్వాత అక్కడకు వచ్చిన దివ్యాంగుడైన ఆ డాక్టర్‌ను ఆయన నిలదీశాడు. మాస్క్ ఎందుకు ధరించావని ప్రశ్నించాడు. రోగికి వైద్యం చేస్తున్నానని ఆ డాక్టర్ చెప్పినా వినిపించుకోలేదు.
మరోవైపు మంత్రి సంజీవ్ గోండ్ వెంటనే జిల్లా చీఫ్ మెడికల్ ఆఫీసర్‌కు ఫోన్ చేశాడు. ‘ఇక్కడ ప్రధాన వ్యక్తి ఎవరు? మీరు అతడ్ని ఇక్కడ ఎందుకు ఉంచారు? మరెవరూ లేరా? అతడి ప్రవర్తన సరిగ్గా లేదు. ప్రజలను ఎలా కలవాలో తెలియదు. అతడ్ని బయటికి పంపండి. ఏదో అడవికి బదిలీ చేయండి. ఇలాంటి వారిని నా నియోజకవర్గంలో ఎందుకు ఉంచారు? అతడ్ని వేరే చోటికి పంపండి. ప్రజలతో ఎలా మాట్లాడాలో ఆ డాక్టర్‌కు తెలియదు. పేషెంట్లతోనూ ఇలాగే ప్రవర్తిస్తూ ఉండవచ్చు’ అని అన్నాడు.
కాగా, ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ప్రతిపక్షాలైన ఎస్పీ, కాంగ్రెస్ నేతలు ఆ మంత్రి తీరును విమర్శించారు. సీఎం యోగి ప్రభుత్వంపై మండిపడ్డారు.
अस्पताल में ‘आवभगत’ नहीं होने से डॉक्टर पर भड़क उठे राज्यमंत्री संजीव सिंह गोंड, जंगल में ट्रांसफर का दे दिया ऑर्डर
सोनभद्र, यूपी#Sonbhadra #UPNews #SanjeevGond pic.twitter.com/sfDrVWkDaw
— Khabargaon (@khabar_gaon) April 17, 2025