Delhi High Court | న్యూఢిల్లీ : ‘శారీరక సంబంధాలు’ అనే పదాలను వాడినంత మాత్రాన లైంగిక దాడి జరిగినట్లు కాదని ఢిల్లీ హైకోర్టు తీర్పు చెప్పింది. ఫిర్యాదుదారు ఇష్టపూర్వకంగా నిందితునితో కలిసి వెళ్లినపుడు పోక్సో చట్టం కింద లైంగిక దాడి జరిగినట్లు ట్రయల్ కోర్టు ఎలా నిర్ణయించిందని ప్రశ్నించింది.
నిందితునికి ట్రయల్ కోర్టు విధించిన యావజ్జీవ శిక్షను రద్దు చేసి, నిర్దోషిగా విడుదల చేసింది. లైంగిక సంభోగం జరిగినట్లు సాక్ష్యాధారాలతో నిరూపించాలని, ఊహాజనితంగా నిర్ణయించకూడదని ఈ నెల 23న ఇచ్చిన తీర్పులో స్పష్టం చేసింది.