అత్యంత పేరు మోసిన డిజిటల్ పేమెంట్ సంస్థ ఫోన్ పే ఓ జబర్దస్త్ ఆఫర్ ప్రకటించింది. అక్షయ తృతీయ పర్వదినం సందర్భంగా ఫోన్ పే యాప్ ద్వారా బంగారం, వెండి కొనుగోలు చేసే వారికి అద్భుతమైన క్యాష్ బ్యాక్‌ను అందిస్తున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. అయితే ఈ ఆఫర్ మే 3 వరకు మాత్రమే వుంటుందని నిర్వాహకులు స్పష్టం చేశారు.
ఈ యాప్ ద్వారా 24 క్యారెట్ల బంగారం, రక రకాల డిజైన్లలో గోల్డ్ కాయిన్స్ రూపంలోనో, లేదంటే బార్ల రూపంలో డెలీవరీ చేయనున్నారు. దీంతో పాటు ఈ యాప్ ద్వారా బంగారం గనక కొంటే 2,500 రూపాయల క్యాష్‌బ్యాక్‌ను కూడా వినియోగదారులు పొందవచ్చు. ఇక వెండి నాణేలు, బార్లను కొనుగోలు చేసే వినియోగదారులకు మాత్రం 250 రూపాయల వరకూ క్యాష్ బ్యాక్ ఇవ్వనుంది.
ఫోన్‌పే ద్వారా 99.99 శాతం స్వచ్ఛమైన బంగారం, వెండి వినియోగదారులకు అందుబాటులో వుందని సంస్థ పేర్కొంది. అలాగే బంగారం ఎవరైతే కొనుగోలు చేస్తారో.. వారందరికీ కొనుగోలు చేసిన ప్రతి సారీ స్వచ్ఛతకు సంబంధించిన సర్టిఫికేట్ కూడా ఇస్తామని సంస్థ ప్రకటించింది. ఇక.. వినియోగదారులు ఏ సమయంలోనైనా ఫోన్‌పే ద్వారా కొనుగోలు చేసుకోవచ్చని సంస్థ పేర్కొంది.