 
                                                            Uttar Pradesh | లక్నో, మే 30: కేంద్రంలో బీజేపీ రెండుసార్లు అధికారంలోకి రావడానికి కారణమైన ఉత్తరప్రదేశ్లో ఈసారి ఆ పార్టీకి ఎదురుగాలి వీస్తున్నదా ? యూపీలో ఆ పార్టీ గెలుచుకునే సీట్ల సంఖ్య తగ్గిపోనున్నదా ? అంటే అవుననే అంటున్నది రాజస్థాన్లోని ఫలోడీ సత్తా బజార్. సత్తా బజార్ అంటే ఒక బెట్టింగ్ మార్కెట్.
ఉత్తరప్రదేశ్లో ఈసారి బీజేపీ సాధించబోయే సీట్ల సంఖ్య తగ్గుతుందని ఫలోడీ సత్తా బజార్ అంచనా వేస్తున్నది. 80 సీట్లున్న యూపీలో బీజేపీకి 2014లో 71, 2019లో 62 స్థానాలు దక్కాయి. ఈసారి మాత్రం 55 నుంచి 65 మధ్య రావొచ్చని ఫలోడీ సత్తా బజార్ లెక్కలు చెప్తున్నాయి.
 
                            