న్యూఢిల్లీ, అక్టోబర్ 11: ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ డిపాజిట్లపై 2020-21 ఆర్థిక సంవత్సరానికి వడ్డీ త్వరలో జమకానుంది. దీపావళికి ముందుగానే ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్వో) 6కోట్ల మంది ఈపీఎఫ్ఓ చందా దారులకు ఈ ప్రయోజనాన్ని అందిస్తుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ముగిసిన ఆర్థిక సంవత్సరానికి పీఎఫ్ నిధులపై వడ్డీ రేటును యథాతథంగా 8.5 శాతంగానే ఈపీఎఫ్వో కొనసాగించింది.