అమర్దీప్ చౌదరి, శైలి చౌదరి జంటగా నటించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘సుమతీ శతకం’. ఎం.ఎం.నాయుడు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఈ నెల 6న ప్రేక్షకుల ముందుకురానుంది. ఉభయ తెలుగు రాష్ర్టాల్లో అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నది. జీరో కట్స్‌తో ఈ సినిమా యు.ఏ సర్టిఫికెట్ పొందిందని, సెన్సార్ వారు కూడా అభినందించారని మేకర్స్ తెలిపారు.
ఇదిలావుండగా ఈ సినిమా కంటెంట్ చూసిన అగ్ర హీరో రవితేజ చిత్రబృందాన్ని అభినందించారు. తాను రవితేజ అభిమానినని, ఆయన్నుంచి ప్రశంస రావడం ఆనందంగా ఉందని హీరో అమర్దీప్ చౌదరి తెలిపారు. టేస్టీ తేజ, మహేష్ విట్ట తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: ఎస్.హలేష్, సంగీతం: సుభాష్ ఆనంద్, రచన-దర్శకత్వం: ఎం.ఎం.నాయుడు.