‘ఎర్రచీర’ మదర్సెంటిమెంట్తో కూడిన హారర్ చిత్రమని, చింతల్ ప్రాంతంలో జరిగిన యథార్థ సంఘటన ఆధారంగా సినిమాను తెరకెక్కించామని చెప్పారు చిత్ర దర్శక నిర్మాత సుమన్ బాబు. బేబీ సాయి తేజస్విని, సుమన్‌బాబు, శ్రీరామ్, కమల్‌కామరాజు, కారుణ్య చౌదరి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఈ నెల 6న విడుదలకానుంది.
ఈ సందర్భంగా బుధవారం దర్శకనిర్మాత సుమన్ బాబు విలేకరులతో ముచ్చటించారు. 37 రోజుల్లో షూటింగ్ పూర్తి చేశామని, సీజీ వర్క్ కారణంగా సినిమా ఆలస్యమైందని, ఉన్నత ప్రమాణాలతో గ్రాఫిక్స్‌ను డిజైన్ చేశామని తెలిపారు. ఈ సినిమాకు సీక్వెల్‌గా అరకులో జరిగిన గిరిజన యథార్థ గాథతో ‘అంబిక’ (ఎర్రచీర-2) చిత్రానికి ప్లాన్ చేస్తున్నామని, అలాగే రాముడా?కృష్ణుడా? అనే రొమాంటిక్ కామెడీ సినిమా కూడా చేయబోతున్నామని సుమన్ బాబు తెలిపారు.