Viral Video | ఉపసంహరించుకున్న రూ. 2 వేల నోటు సెప్టెంబర్ 30వ తేదీ వరకు చలామణిలో ఉంటుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అయితే కొందరు వ్యాపారులు మాత్రం సామాన్యుల నుంచి రూ. 2 వేల నోటును స్వీకరించడం లేదు. ఉత్తరప్రదేశ్‌లోని జలౌన్ జిల్లాలో ఓ ఆశ్చర్యకర ఘటన వెలుగు చూసింది.
ఓ వాహనదారుడు పెట్రోల్ బంక్‌కు వెళ్లి.. తన యాక్టివా వాహనంలో పెట్రోల్ పోయించుకున్నాడు. ఆ తర్వాత బంక్ సిబ్బందికి రూ. 2 వేల నోటు ఇచ్చాడు. బంక్ సిబ్బంది మాత్రం ఆ వాహనదారుడి నుంచి రూ. 2 వేల నోటు స్వీకరించలేదు. ఇక యాక్టివాలో నింపిన పెట్రోల్‌ను పైపు సహాయంతో బంక్ సిబ్బంది బయటకు తీశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
ఈ వ్యవహారంపై పోలీసులు స్పందించారు. ఆర్బీఐ ఆదేశాల ప్రకారం వ్యాపారులు నడుచుకోవాలని పోలీసులు సూచించారు. రూ. 2 వేల నోటు స్వీకరించని వారిపై తగు చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.
ఒక్క ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు.. ఆయా రాష్ట్రాల్లోని పెట్రోల్ బంకుల్లో ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. రూ. 2 వేల నోటును స్వీకరించబోమని బోర్డులు ఏర్పాటు చేశాయి.
A petrol pump of Maharaja Chowk, Durg chattisgarh is denying acceptance of Rs 2000 Notes. Have 2000 notes lost their legal tender status? @RBI @FinMinIndia @nsitharaman pic.twitter.com/57FdunTURo
— Tejas 🇮🇳 (@railmintejas) May 20, 2023
People line up at petrol pumps to exchange ₹2000 notes.
Petrol Pump put up notices saying ‘No Change Available’#2000NoteWithdrawn #2000NOTE #2000CURRENCYNOTES #2000RS #rupees #currently #legaltender #government #BJP #RBI #Bank #Narendramodi pic.twitter.com/6r2OWgNyoS
— Joy (@ourunstablemind) May 22, 2023
2000 notes not accepted. Petrol pump pic.twitter.com/BvbXz78M7w
— Bilkul Sahi 🇮🇳 (@BilkulSahi) May 21, 2023
@DirMktg_iocl @DirMktg_iocl @IOCRetail @FinMinIndia @RBI @nsitharaman @PMOIndia This sign at an Indian Oil Petrol Pump says all about how and panic can be created with wrong understanding of simple withdrawal process for ₹2000 currency. Pl take care and inform your pumps. pic.twitter.com/Fe6DPWMVVr
— nipunsheth (@nipunsheth2) May 21, 2023