మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు
డీజిల్ ధరలు| దేశంలో మళ్లీ పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నాయి. వరుసగా నాలుగో రోజూ పెట్రో ధరలను పెంచుతూ దేశీయ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి.

న్యూఢిల్లీ: దేశంలో మళ్లీ పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నాయి. వరుసగా నాలుగో రోజూ పెట్రో ధరలను పెంచుతూ దేశీయ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో లీటర్ పెట్రోల్‌పై 25-28 పైసలు, డీజిల్‌పై 30-33 పైసల వరకు పెరిగాయి. తాజా పెంపుతో ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.91.27, డీజిల్ రూ.81.73కు చేరింది. ఇక ముంబైలో పెట్రోల్ రూ.97.61, డీజిల్ రూ.88.82, చెన్నైలో పెట్రోల్ రూ.93.15, డీజిల్ రూ.86.65, కోల్‌కతాలో పెట్రోల్ రూ.91.41, డీజిల్ రూ.84.57కు చేరాయి. బెంగళూరులో పెట్రోల్ రూ.94.30, డీజిల్ రూ.86.64కు, హైదరాబాద్‌లో పెట్రోల్ రూ.94.86, డీజిల్ రూ.89.11కు, జైపూర్‌లో పెట్రోల్ రూ.97.65, డీజిల్ రూ.90.25గా ఉన్నాయి.
ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధమైన పన్నులు విధిస్తుండటంతో పెట్రోల్, డీజిల్ ధరల్లో తేడాలు ఉంటాయి. ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల నేపథ్యంలో సుమారు రెండు నెలలపాటు దేశంలో పెట్రోల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. ఎన్నికలు ముగియడంతో గత నాలుగు రోజులుగా ధరలు పెరుగుతూ వస్తున్నాయి. దీంతో ఢిల్లీలో నాలుగు రోజుల్లో పెట్రోల్ పై 82 పైసలు, డీజిల్‌పై రూ.1 పెరిగాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
ముంబైలో ఎయిర్ అంబులెన్స్ అత్యవసర ల్యాండింగ్.. తప్పిన ప్రమాదం
నేడు కాంగ్రెస్ ఎంపీలతో సోనియాగాంధీ భేటీ
చైనా రాకెట్‌పై అమెరికా సైన్యానికి ప్రణాళిక లేదు : లాయిడ్ ఆస్టిన్
మరో హీరోయిన్‌కు కరోనా పాజిటివ్
రాజస్థాన్‌లో 14 రోజుల లాక్డౌన్
బోరు బావిలో పడిన బాలుడు.. సహాయక చర్యలు ప్రారంభం
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

