Deputy CM | చెన్నై, అక్టోబర్ 29: తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ వస్త్రధారణపై మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. డిప్యూటీ సీఎంగా ఆయన సరైన డ్రెస్ కోడ్ పాటించటం లేదని, పార్టీ చిహ్నాలను ప్రదర్శించే దుస్తులను ధరించి అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని, ఇది రాజ్యాంగ ఉల్లంఘన కిందికి వస్తుందని పిటిషన్లో ఆరోపించారు.
దీనిపై స్పందన తెలియజేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీచేసింది. ప్రభుత్వ అధికారులు, రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారికి ఫార్మల్ డ్రెస్ కోడ్ వర్తిస్తుందా? లేదా? అన్నది పరిశీలించాలని అడ్వొకేట్ జనరల్‌ను కోరింది. ఉదయనిధి స్టాలిన్ ఫార్మల్ డ్రెస్ కోడ్ పాటించటం లేదని పిటిషన్‌దారు ఆరోపించారు.